Friday, October 30, 2009

Sunita: ద ఫౌంటెన్‌హెడ్

ఇహ కధలోకి వస్తే కధ ఎత్తుకోవడమే, కధానాయకుడు Roark‌ని, ఆర్కిటెక్చర్ స్కూల్ నుంచి తొలగించడంతో మొదలవుతుంది. ఎందుకు తొలగించారు అంటే ’కొత్తవి సృష్టించలేము, పాత వాటిని అనుసరించి మాత్రమే ముందుకెళ్ళగలం" అనే సిద్దాంతాన్ని వ్యతిరేకించబట్టి. ఇక్కడ Roark ను ఇలా పరిచయం చేసింది రచయిత్రి.. సొంత అలోచన ఉన్నవాడు, అమెరికన్ సమాజంలో, డిగ్రీ దాకా వచ్చి దాన్ని వదిలేసుకోవటం, అదీ భావ వ్యతిరేకిత వల్లేనంటే, అది చిన్న విషయం కాదు. ఇక్కడే ఇంకో ముఖ్య పాత్ర Peter Keating. మామూలు భాషలో చెప్పాలంటే వెన్నెముక లేనివాడు, మెత్తగానే ఉంటూ, పనులు చేసినట్టే కనిపిస్తూ, పనిచేయించుకున్న వాళ్ళనే నిచ్చెనగా చేసుకుని ఎలా పైకి ఎదగొచ్చో అనేవి, ఈ కీటింగ్ ద్వారా రచయిత్రి చెబుతుంది. ఇవి రెండు నవలలో ముఖ్య పాత్రలు. స్కాలర్‍షిప్‍తో చదువు ముందుకు సాగించటమా, లేక ఉద్యోగం చేయడమా అనేది తేల్చుకోలేని కీటింగ్, Roarkని సంప్రదించి ఉద్యోగంలో చేరతాడు.
ఏ సభ్యసమాజం లోనైనా, పోలీసింగ్ లేదా వాచ్‌డాగ్ లేదా ఏపేరైనా, ఉంటుంది. వివిధ వృత్తుల్లో మంచి చెడ్డలూ, వాటిని గమనించడాలూ, వాటిని మీడియాలో ప్రకటించడాలూ ఉంటాయి. ఇది అమెరికాలో ఇంకా ఎక్కువ. మీడియా ఎలా ప్రభావితం చేస్తుందో అనేది టూయీ (Ellsworth Toohey) అనే రచయత పాత్ర ద్వారా, రచయిత్రి మనకు చెబుతుంది. ఈయన మేనకోడలూ, ఆమెకు కీటింగ్‍‌తో చిన్నపాటి అఫైరు ఇంకో పిట్టకధ .
మధ్యలో ఇంకో ముఖ్య పాత్ర - గైల్ వైనాండ్ (Gail Wynand). ఇతను ఓ పత్రికాధిపతి. అతని పత్రిక పేరు - "New York Banner". కథలో సగభాగం వరకూ కనబడకపోయినా, అంతర్లీనంగా కథాగమనాన్ని శాశించే పాత్ర అది. ఆ అంశంలో రాండ్ ప్రతిభ ప్రశంసించ దగ్గది.
ఫ్రాంకన్ అండ్ హేయర్ (Francon & Heyer) అనే కంపనీ లో కీటింగ్ అనుభవాల ద్వారా, ఒక్క ప్లాను గూడా గియ్యకుండా కేవలం కంపెనీ బ్రాండ్ నేమ్ ఉపయోగించుకుని ఎలా నడిపేస్తారో, నడపవచ్చో రచయిత్రి చెబుతుంది. సరే, మరో పక్క, మన హీరో, హెన్రీ కామెరన్ (Henry Cameron) అనే ఒక తాగుబోతు దగ్గర పనికి కుదురుకుంటాడు. డిగ్రీ కాగితం లేకుండా పని ఇవ్వాలంటే, ఎంతో కొంత నలుగురి కంటే భిన్నంగా అలోచించే వాడై ఉండాలి. Henry Cameron సరిగ్గా అలాంటి వాడే. గత వైభవం తప్ప ఇంకేమీ మిగలని విఖ్యాత architect.
తరువాత కొన్ని కారణాల వల్ల, Henry Cameron ఆఫీసు మూత పడిపోతుంది. తప్పని సరై, కీటింగ్ ఆఫీసులోనే పనిలో చేరతాడు Roark. ఒక రోజు కట్టుబడిలో ఉన్న బిల్డింగ్ చూడటానికి వెళ్ళిన Roark‌కు, మైక్ అనే ప్లంబర్‌తో పరిచయం అవుతుంది. Roarkలోని తనవైన ఆలోచనలూ, స్వంత నిర్ణయాలూ, నచ్చని దాన్ని వ్యతిరేకించే స్వభావం, ఇవన్నీ మైక్ ని ఆకట్టుకుంటాయి. కానీ, Roark వీటివల్లే వల్ల ఉద్యోగం కోల్పోతాడు.
ఇలా స్కూల్ నుంచీ, ఉద్యోగం నుంచీ గెంటివెయ్యబడ్డ హీరోకు, ఎవరూ మరలా ఉద్యోగం ఇవ్వరు. ఎన్నో ప్రయత్నాల తరవాత జాన్ ఎరిక్ స్నైట్ (Jan EriK Snyte) అనే పెద్ద మనిషి ఉద్యోగమిస్తాడు. అతని కింద ఓ ఐదుగురు విభిన్నమైన డిసైనర్లు పనిచేస్తుంటారు. వీరి మధ్య ఎప్పుడూ కాంపిటీషనే. అందరి డిజైన్లనూ చూసి ఆఖరుకు తనకు నచ్చిన ఒకదాన్ని ఎన్నుకుంటాడు స్నైట్. అలా, తన పనిని ఎన్నుకోక పోయినా తాను చేసిన దానిని మార్చకుండా ఉంచటం వల్ల Roark కీ జాబ్ శాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఆ క్రమం‌లోనే, ఒకసారి హెల్లర్ (Heller) అనే వ్యక్తి ఇచ్చిన పనుల్లో, Roark డిసైను ఎన్నుకోబడుతుంది. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన వల్ల Roark ఉద్యోగం మానేసి, సొంత ఆఫీసు తెరుస్తాడు.
ఇంతలో ట్రేడు యూనియన్లూ, కాంట్రాక్టర్ల గొడవ మొదలవుతుంది. అప్పుడే కీటింగు‌కి టూయీ పరిచయమౌతాడు. ఇలాటివి సద్దుమణిగినాక, హీరోయిను డామినిక్ ఫ్రాంకన్ (Francon & Heyers లో Francon గారి కుమార్తె) పాత్ర కధలోకి వస్తుంది. రావడమే "న్యూయార్ల్ బేనర్" లో, ఫ్రాంకన్ కంపనీలో కీటింగ్ వేసిన డిసైనును ఘాటుగా విమర్శిస్తూ ప్రవేశిస్తుంది. హీరోయిను స్వభావం చూస్తే దేనికీ ఆశ పడని రకం, ఎందుకంటే ఏదైనా ఆశ పడితే దానికోసం వంగాల్సి ఉంటుంది. విషయాలన్నీ ఒకదానితో ఒకటి పడుగూ పేకలాగా కలిసిపోయి ఉంటాయనే రకం. ఆమె స్వభావం ఆమె తండ్రికి నచ్చదు. ఐతే ఫెన్సు మీద నుండి దూకుతూ డాడీ అని అరిచే చిన్న పిల్లగానే అతని స్మృతిపధం లో ఉండి ఆమె మీద కోపాన్ని కంట్రోలు చేస్తూ ఉంటుంది.
// ఈ కింద పేరాలో ఏం జరిగిందో నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. //మొదటి అసైన్మెంటు ఐన Heller House తో కామరూన్ ను కలుస్తాడు Roark. ఎలాంటి మాట లేకుండా స్నాప్ షాట్స్ తెమ్మంటాడు. ఆ పని చేసి కొలోనియల్ స్టైల్లో కట్టిన హెల్లర్ ఇల్లు చూస్తానికి వెళ్ళినప్పుడు మళ్ళా మైక్ ఎదురౌతాడు. నీ దగ్గర పని ఉంటే నేనెప్పుడైనా రెడీ అన్న మైక్ తో స్నేహం చిరకాలం ఉంటుంది. తనకి వచ్చిన అవకాశాల్లోచాలా వరకూ పాత వాటిని తిరిగి తయారు చెయ్యమనే, ఎందుకంటే అవి ఙ్ఞాపకాలు కనుక. ఐతే ఇవేవీ అతనికి సరె అనిపించవు. కష్టపడి కొంత మేర జేబులోంచి పెట్టి మరీ ఒక ఇల్లు పూర్తి చేస్తాడు ఐతే కట్టించుకున్న ఆసామీ బదులు అతని కుమారుడు ఆ ఇంట్లో ఉంటాడు మన వాడి రెజ్యూమే లో పోటీ కి పనికి రాడనే విశేషణం ఒకటి జోడవుతుంది.
Heller House తరువాత పని తగ్గి అవకాశాలు మృగ్యమై, బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న Roark కి cameron వద్ద నుండి మళ్ళీ పిలుపు వస్తుంది. అసలు శతృవు వర్గ శత్రువు వైనాండ్ అని, తను పోరాడాల్సింది అతనితో అని చెప్పి కన్ను మూస్తాడు Cameron. మైక్ సాయంతో, కొత్త కొలువు దొరుకుతుంది Roarkకి. కన్నెక్టికట్ లోని ఒక గ్రానైటు క్వారీలో .
ఇదే సమయానికి కీటింగ్ చాలా ధనవంతుడైపోతాడు. ఫ్రాంకన్‌ నుంచీ వెళ్ళిపోయే ముందు, Roark కొన్ని డిజైన్సు చేస్తాడు. వాటినే వాడుకొని, తనకు తోచిన విధంగా అలంకరించి, తన డిజైన్లుగా కీటింగ్ ప్రచారం చేసుకుంటాడు. ఆ డిజైన్ ఇచ్చిన విజయంతో, కీటింగ్ ఫ్రాంకన్‌లోనే భాగస్తుడైపోతాడు. ఇదంతా పూర్వార్ధం.
ఓసారి వేసవి సెలవలకని కనెక్టికట్ వస్తుంది డామినిక్. ఇక్కడే డామినిక్ Roark ను చూస్తుంది. ఇదరికీ ముఖపరిచయాలేర్పడతాయి. ఐతే అతనెవరో, ఆమెకు తెలియదు. కనీసం పేరు కూడా తెలుకోదు. అతనూ ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నమేమి చెయ్యడు. ఇంతలో Roger Enright అనే వ్యక్తి కమిషను అందటంతో, Roark తిరిగి న్యూయార్క్ చేరుకుంటాడు. అక్కడ, ఒక పార్టీలో Dominique కి మళ్ళీ పరిచయమవుతాడు. ఐతే వీళ్ళిద్దరి రిలేషను నేనిక్కడ చర్చించడం లేదు. అది ఎవరికి వారుచదువుకుని అనలైజు చేసుకోవాల్సిందే. ఇది ఒకలాంటి లవ్-హేట్ సంబంధం. చూసేవాళ్ళ దృష్టిలో వాళ్ళిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది అనే అభిప్రాయం కలుగుతుంది.
మెల్లగా పని దొరుకుతూ రోయార్క్ ఆఫీసు పుంజుకుంటుంది. ఒకే సమయంలొ నాలుగైదు కమిషన్లు అందిన సందర్భాలూ వస్తాయి. ఇంతలో Hopton Stoddard (హాప్టన్ స్టాడర్డ్) అనే వ్యక్తి నిర్మించ దల్చిన Stodard Temple కాంట్రాక్ట్ కూడా వస్తుంది. ఆ టెమ్పుల్‌కి అవసరమైన శిల్పం కోసం తనలాంటి భావజాలమున్న శిల్పినే, Roark పెట్టుకుంటాడు. ఆ శిల్పితో స్నేహం కూడా చివరిదాకా ఉంటుంది. ఈ శిల్పానికి మొడల్‌గా, డామినిక్‌ పనిజేస్తుంది. అమెరికన్ సమాజం లో షేరు మార్కెట్ ప్రభావం ఎంత వుందో కూడా కధానుగుణంగా ఇక్కడ చర్చిస్తుంది రచయిత్రి. ఐతే ఈ Stodard Temple సదరు Stodard గారికి నచ్చక, చెప్పినట్లు కట్టలేదని కేసు వేస్తాడు. అందులో ఓడిపోయి మళ్ళా మొదటికే వస్తాడు Roark. డామినిక్ కీటింగ్ ను పెళ్ళిచేసుకుంటుంది. (జరిగిన సందర్భాన్ని, అందులోని ఆంతర్యాన్ని చదివే అర్థం చేసుకోవాలి కానీ, ఒకరు చెపితే అర్థమయ్యే విషయం కాదు కనుక ఇక్కడ చెప్పటం లేదు).
// ఈ పేరా కూడా.....ఆ శిల్పాన్ని ఎవరికి ఎవరు బహుమతిగా ఇచ్చారు? దానితో వైనాండ్, కీటింగ్‌కి ఎలా కాంట్రక్టు దక్కించాడు!?... అర్ధం గాలేదు //ఇప్పుడు కధలోకి News Paper owner వైనాండ్ ప్రవేశిస్తాడు. టూహీ Stoddard Temple కోసం డామినిక్ మోడల్ గా నిలబెట్టి చెక్కిన శిల్పాన్ని బహుమతిగా ఇచ్చి కాస్త కమిషన్లు తగ్గిన కీటింగుకి వైనాండ్ కాంట్రాక్ట్ దక్కేలా చేస్తాడు. అలా డామినిక్ వైనాండ్ కి పరిచయం అవుతుంది. కీటింగ్ ప్రకారం తన జాబ్ కమిషను కోసం భార్యను వైనాండ్ కు అప్పచెప్పేస్తాడు.
// ఇక్కడ పేరాలో కూడా...."మళ్ళీ పెళ్ళి పస్తావన వస్తుంది"...ఇంతకు ముందు ఒకసారి ప్రస్తావన వచ్చినట్టు ఎక్కడ రాశారు!?// ఓ రెండు నెల్లు Wynand yacht మీద అతనితో క్రూజ్ వెళ్తుంది డామినిక్. ఆ యాచ్ పేరు I Do. పడవ ప్రయాణానికి ముందు తన ఆర్ట్ గాలరీ అంతా డామినిక్ ను తిప్పి చూపిస్తాడు. ఒక వారం కలిసి కబుర్లాడుతూ యాచ్ మీద గడిపాక మళ్ళీ పెళ్ళి ప్రస్తావన వస్తుంది. వైనాండ్ ను పెళ్ళి చేసుకోవడానికి డామినిక్ ఒప్పుకుంటుంది. కీటింగ్‌కు విడాకులిచ్చి, ఓ 600 మంది ఆహతులు మధ్య వివాహం చేసుకుంటుంది. ఒక డైవర్సీని వైనాండ్ పెళ్ళి చేసుకున్నందుకు, మీడియా అంతా కోడై కూస్తుంది.
డామినిక్ - వైనాండ్ల మధ్య మాటల్లో, ’ఇది కూడా మనసులేని కాపురమే’ అని డామినిక్ నిజాయితీగా ఒప్పుకుంటుంది. అంతే నిజాయితీతో వైనాండ్ స్పందిస్తాడు, "నేను నా ప్రేమ గురించి మాత్రమే అలోచించాను" అంటాడు.
ఇదే సమయంలో Roark కు ఒక రెసార్ట్ వర్క్ దొరుకుతుంది. రెండేండ్లు ఖాళీ లేకుండా పనిచేస్తాడు. ఐతే రెసార్ట్ గురుంచి ఎక్కడా చడీ చప్పుడు ఉండదు. కట్టించేవాళ్ళు, రిసార్ట్‌ని, అధిక లాభాలకి అమ్మేసి దివాళా పెట్టే పనిలో ఉంటారు. అందుకుగానూ, ఓ పనికిమాలిన architect గా Roarkను వాళ్ళు ఎంచుకుంటారు.
ఇంతలో Roarkని కలవాలంటూ, వైనాండ్ ఓ పిలుపు పంపిస్తాడు. కలవగానే, ఇద్దరూ ఒకరినొకరు అంచనా వేసుకున్నట్టే చూసుకుంటారు. వైనాండ్ తన భార్య కోసం ఒక భవనాన్ని కట్టించాలని చెబుతాడు. రోయార్క్ ప్రతిభ ఆ భవనానికీ ప్రపంచానికి మధ్య అడ్డుగా ఇంకే గోడలూ లేకుండా ఉండాలని చెబుతాడు.// ఈ చివర వాక్యం అర్ధమైతే చెప్పెట్టుకొట్టండి. బహుశా మీ ఉద్దేశ్యం ఇది : ఆ భవన నిర్మాణంలో రోయార్కు ప్రతిభ ప్రతిబించించాలని, తద్వారా రోయార్క్ ప్రతిభకీ, ప్రపంచానికీ మధ్యా మరే విధమైన అడ్డుగోడలూ ఉండకూడదని చెబుతాడు.
భవంతి కట్టాల్సిన స్థలానికి, డ్రాయింగులతో వెళ్తారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. వైనాండ్ Roark ను ఇంటికి ఆహ్వానిస్తాడు. భార్యను చూపిస్తాడు. తర్వాత తనే కొన్నిసార్లు స్వయంగా Roark ఆఫీసుకు వెళతాడు. తన స్టాఫ్‌ను పిలిచి, రోయార్క్ కు వ్యతిరేకంగా పత్రికలో ఏమీ రాయొద్దని చెబుతాడు.
భవనంతో పాటూ, ఇలా ఇద్దరి పరిచయం పెరుగుతూ ఉంటుంది. నిర్మాణం పూర్తవుతుంది. డామినిక్ అందులో నివాసంమొదలుపెడ్తుంది. ఇంతలో వైనాండ్ పేపరు గురించి, జనంలో వ్యతిరేకత ప్రబలటం మొదలవుతుంది, టూయీ వల్ల. పీటర్ కీటింగ్ తన అవకాశవాదాన్ని మరలా బైటపెట్టుకుంటాడు. ఈసారి Catherine (టూయీ మేన కోడలు, అతని తొలి ప్రేయసి)ను ప్రపోజ్ చేస్తాడు. ఐతే ఆమె కూడా మెత్తని చెప్పుతో కొడుతుంది.
కధ నడుస్తూనే ఉంటుంది. ఓ పక్క పేపరులో గొడవలు పెంచేసి, అవకాశం కోసం ఎదురుచుస్తుంటాడు టూయీ. మరో పక్క, టూయీ ద్వారా, కీటింగ్ ఓ ప్రాజెక్టు సంపాదించుకుంటాడు. Cartlandt హౌసింగనే ఆ ప్రభుత్వ హౌసింగు ప్రాజెక్ట్ పనినంతా, Roark చేత చేయించుకుని, కీటింగ్ తన పేరు పెట్టుకుంటాడు. Roark కూడా, తానే రకంగా వేస్తాడో, అలాగే అది నిర్మింపబడాలని, ఈ పని చేసిపెట్టేముందు ఓ కండిషన్ పెడతాడు. తరువాత వైనాండ్‌తో క్రూజ్‌పై వెళ్టాడు. తిరిగొచ్చిన Roark, ఆ ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్ళి చూస్తే, కీటింగ్ నిస్సహాయత వల్ల అదంతా మార్పుచేర్పులకు గురైనట్లు తెలుసుకుంటాడు. Dominique సహాయంతో, దాన్ని పేల్చేస్తాడు. ఆ సందర్భంలో అరెస్ట్ అయిన Roarkని సమర్ధించినందుకు, Wynand పైన టూయీ తిరుగుబాటు లేవదీసి లొంగదీస్తాడు.
// కింద పేరాలో "సృష్టిస్తుంది" - రచయిత్రి సృష్టించిందా? లేక పతిస్థితులే ఆ సస్నివ్వేశాన్ని సృష్టిస్తాయని!!! నేను మార్చాను //బెయిలు పైన బయటకొచ్చిన వైనాండ్, Roark వద్దకు వెళ్ళి, విషయం పత్రికలకెక్కేలా చేస్తాడు. డామినక్‌కి విడాకులిస్తున్న వైనాండ్ అని ప్రచారం సాగిస్తాడు. దీని వల్ల, వైనాండ్ పేపర్ల సర్క్యులేషన్లు మళ్ళీ పెరుగుతాయి. ఆ పేల్చివేత కేసులో, జ్యూరీ ముందు Roark తన వాదన వినిపిస్తాడు. "క్రియేటర్స్" గురించి, "సెకండ్ హాండర్స్" గురించీ, "Egoism" అనేది ఎలా మంచిదో, దాని అసలు అర్థమేదో, స్వార్ధం లేక పోవడం ఎలా హానికరమో వివరిస్తాడు Roark. అతని వాదన విన్న జ్యూరీ అంతా కలిసి, "నాట్ గిల్టీ" అని ( అతన్ని నిరపరాధిగా) తీర్పునిస్తారు.
చివరికి : డామినిక్‌‌కి వైనాండ్ విడాకులిస్తాడు. Cartlandt project ని Enright సంపాదించి, Roark కే అప్పగిస్తాడు. వైనండ్ సెక్రటరీ Roark అప్పాయింట్మంట్ తీసుకుని, "వైనాండ్ బిల్డింగ్" కట్టేందుకు కాంట్రాక్ట్ ఇస్తుంది.
Roark వ్యక్తిత్వం సంపూర్ణంగా అర్థం చేసుకుని, తన లోపాల్ని సరిజేసుకున్న డామినిక్, ఇప్పుడు రొయార్క్ భార్య. వైనాండ్ బిల్డింగ్ యొక్క నేము ప్లేటు మీద "Howard Roark, Architect" అన్న అక్షరాలని, గర్వంగా చూస్తూ, అతని కోసం ఎలివేటర్లో పైకి వెళితుంది.ఆ పైనుంచి కింద అన్నీ చిన్నవిగా కనిపిస్తే, ఈ ఒక్క కట్టడం రాజ సౌధంలా, ఠీవిగా, అంత ఎత్తుగా కనిపిస్తుంది.
స్తూలంగా ఇదీ కధ.

ద ఫౌంటెన్‌హెడ్

ద ఫౌంటెన్‌హెడ్
"కొత్తవి సృష్టించలేము, పాతవాటిని అనుసరించి మాత్రమే ముందుకెళ్ళగలం" అనే సిద్దాంతాన్ని వ్యతిరేకించినందుకు, కధానాయకుడు Roarkని, ఆర్కిటెక్చర్ స్కూల్ నుంచి తొలగించడంతో, కథ మొదలవుతుంది. ఓ స్వతంత్రభావాలు నిండిన పాత్రగా, ఇక్కడ రోయార్క్‌ను పరిచయం చేస్తుంది రచయిత్రి. అమెరికన్ సమాజంలో, డిగ్రీదాకా వచ్చి, దాన్ని వదిలేసుకోలంటే, మామూలు విషయం కాదు. అదీ కేవలం భావవ్యతిరేకత వల్లే వదులు కోవడమంటే, అంత చిన్న విషయం కాదు. ఇక్కడే వచ్చే, ఇంకో ముఖ్యపాత్ర - Peter Keating. మామూలు భాషలో చెప్పాలంటే వెన్నెముక లేనివాడు. మెత్తగానే ఉంటూ, పనులు చేసినట్టే కనిపిస్తూ, ఎదుటివాళ్ళని నిచ్చెనగా చేసుకుని, ఎలా పైకి ఎదగొచ్చో, ఈ కీటింగ్ ద్వారా రచయిత్రి చెబుతుంది. ఇవి రెండూ నవలలో ముఖ్య పాత్రలు. స్కాలర్‍షిప్‍తో చదువును సాగించటమా, లేక ఉద్యోగం చేయడమా అనేది తేల్చుకోలేని కీటింగ్, రోయార్క్‌ని సంప్రదించి ఉద్యోగంలో చేరతాడు.

ఏ సభ్యసమాజంలోనైనా, పోలీసింగ్ లేదా వాచ్‌డాగ్ (పేరేదైతేనే) అనేది ఉంటుంది. అంటే, సమాజంలో ఉన్న వివిధ వృత్తులన్నంటిలోనూ, మంచి-చెడ్డలు ఉంటాయి. వాటిని గమనించడాలూ, వాటిని మీడియాలో ప్రకటించడాలూ ఉంటాయి. ఇది అమెరికాలోఐతే, ఇంకా ఎక్కువ. మీడియా తన ప్రభావంతో ఈ సమాజంపై పట్టు ఎలా సాధిస్తుందనేది, టూయీ (Ellsworth Toohey) అనే రచయత పాత్ర ద్వారా, రచయిత్రి మనకు చెబుతుంది. ఈయన మేనకోడలూ, ఆమెకు కీటింగ్‍‌తో ఉండే చిన్నపాటి అఫైరు - ఇంకో పిట్టకధ .

మధ్యలో వచ్చే మరో ముఖ్య పాత్ర - గైల్ వైనాండ్ (Gail Wynand). ఇతను ఓ పత్రికాధిపతి. అతని పత్రిక పేరు - "New York Banner". కథలో సగభాగం వరకూ కనబడకపోయినా, అంతర్లీనంగా కథాగమనాన్ని శాశించే పాత్ర ఇది. ఆ అంశంలో రాండ్ ప్రతిభ ప్రశంసించ దగ్గది.

ఫ్రాంకన్ అండ్ హేయర్ (Francon & Heyer) అనే కంపనీలో కీటింగ్ అనుభవాల ద్వారా, ఒక్క ప్లాను గూడా గియ్యకుండా కేవలం కంపెనీ బ్రాండ్ నేమ్ ఉపయోగించుకుని ఎలా నడిపేస్తారో, నడపవచ్చో రచయిత్రి చెబుతుంది. మరో పక్క, మన హీరో, హెన్రీ కామెరన్ (Henry Cameron) అనే ఒక తాగుబోతు దగ్గర పనికి కుదురుతాడు. డిగ్రీ లేకుండా పని ఇవ్వాలంటే, ఎంతో కొంత నలుగురి కంటే భిన్నంగా అలోచించే వాడై ఉండాలి. Henry Cameron సరిగ్గా అలాంటి వాడే. గత వైభవం తప్ప ఇంకేమీ మిగలని విఖ్యాత architect.

కొన్ని కారణాల వల్ల, Henry Cameron ఆఫీసు మూత పడిపోతుంది. తప్పని సరై, కీటింగ్ ఆఫీసులోనే రోయార్క్‌ కూడా పనిలో చేరతాడు. ఒక రోజు, నిర్మాణంలో ఉన్న ఓ భవంతి పనులు చూడటానికి వెళ్ళిన రోయార్క్‌కి, మైక్ అనే ప్లంబర్‌తో పరిచయం ఔతుంది. రోయార్క్‌ సొంత ఆలోచనలూ, సొంత నిర్ణయాలూ, ఏదేని నచ్చని విషయాన్ని వ్యతిరేకించే స్వభావం, ఇవన్నీ మైక్‌ని ఆకట్టుకుంటాయి. కానీ, వీటివల్లే రోయార్క్‌ ఉద్యోగం కోల్పోతాడు.

ఇలా స్కూల్ నుంచీ, ఉద్యోగం నుంచీ గెంటివెయ్యబడ్డ హీరోకి , మళ్ళీ ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. ఎన్నో ప్రయత్నాల తరవాత జాన్ ఎరిక్ స్నైట్ (Jan EriK Snyte) అనే పెద్దమనిషి ఉద్యోగమిస్తాడు. అతని కింద ఓ ఐదుగురు విభిన్నమైన డిజైనర్లు పనిచేస్తుంటారు. వీరి మధ్య ఓ నిరంతరంమైన పోటీ ఉంటుంది. అందరి డిజైన్లనూ చూసి, ఆఖరుకు తనకు నచ్చినదేదో ఒక్కదాన్నే, స్నైట్ ఎన్నుకుంటాడు. ఐతే, తన డిజైన్‌ని ఎన్నుకోకపోయినా, తాను చేసిన దానిని మార్చకపోవడం వల్ల, రోయార్క్‌కి ఈ ఉద్యోగం మంచి సంతృప్తినిస్తుంది. ఇలా ఉండగా, ఒకసారి హెల్లర్ (Heller) అనే వ్యక్తి ఇచ్చిన పనుల్లో, రోయార్క్‌ చేసిన డిజైన్‌ని, ఎన్నుకుంటారు. అప్పుడు జరిగిన ఓ సంఘటనతో, రోయార్క్‌ ఉద్యోగం మానేసి, సొంత ఆఫీసు తెరుస్తాడు.

మరో పక్క ట్రేడు యూనియన్లూ, కాంట్రాక్టర్ల గొడవ మొదలవుతుంది. కీటింగు‌కి, అప్పుడే "టూయీ"తో పరిచయమౌతుంది. అవి సద్దుమణిగాక, కధలోకి హీరోయిను పాత్ర వస్తుంది. ఆమె పేరు - డామినిక్ ఫ్రాంకన్(Dominique Francon). ఈమె Francon & Heyersలో Francon గారి కుమార్తె. ఈ పాత్ర వస్తూనే, ఫ్రాంకన్ కంపనీలో కీటింగ్ వేసిన డిజైనుని, "న్యూయార్క్ బేనర్" పత్రికలో ఘాటుగా విమర్శిస్తూ ప్రవేశిస్తుంది. దేనినీ ఆశ పడని మనస్తత్వం ఆమెది. ఏదైనా ఆశ పడితే, దానికోసం మనిషి లొంగిపోవలసి వస్తుందని, ఆమె అభిప్రాయం. తండ్రికి ఆమె స్వభావం అంత నచ్చదు. ఐతే, "డాడీ" అని అరుస్తూ, ఫెన్సు మీద నుండి దూకే తన చిట్టితల్లి స్మృతిపధంలో మెదిలినప్పుడల్లా, ఆ తండ్రికి కూతురిపై కోపం చప్పున చల్లారి పోతుంది.

అటువైపు, సొంత ఆఫీసు తెరిచిన రోయార్క్‌, తన మొదటి అసైన్‌మెంటు ఐన Heller House నిర్మాణం కోసం, తిరిగి కామెరన్‌ని కలుస్తాడు. కామెరన్ కూడా, ఎలాంటి మాటా లేకుండా, స్నాప్ షాట్స్ తెమ్మంటూ పని ఒప్పేసుకుంటాడు. కొలోనియల్ స్టైల్లో పూర్తిచేసిన ఆ హెల్లర్ ఇల్లు చూసుకోడానికి రోయార్క్‌ వెళ్ళినప్పుడు, మళ్ళీ మైక్ ఎదురౌతాడు. "నీ దగ్గర పని ఉంటే, నేనెప్పుడైనా రెడీ" అన్న మైక్‌తో, రోయార్క్‌కి ఓ చిరకాల స్నేహం కుదురుతుంది. తనకి వచ్చిన అవకాశాలని, చాలా వాటిని రోయార్క్‌ తిరగ్గొడతాడు. పాతవాటిని తిరిగి నిర్మించడానికి, అతను సమ్మతించడు. వాటిని "ఙ్ఞాపకాలు" గా భావిస్తుంటాడు. బాగా కష్టపడి, కొంతమేర తనజేబులోని డబుపెట్టి మరీ ఆ ఇల్లు పూర్తిచేస్తాడు. ఐతే కట్టించుకున్న ఆసామీ బదులుగా, అతని కుమారుడు ఆ ఇంట్లో ఉంటాడు. మనవాడి రెజ్యూమేలో, ’పోటీకి పనికిరాడ’నే మరో విశేషణం జోడవుతుంది.

Heller House తరువాత, పని తగ్గిపోయి,అవకాశాలు మృగ్యమై, బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఉన్న రోయార్క్‌కి, మళ్ళీ Cameron వద్ద నుండి పిలుపు వస్తుంది. అసలు వర్గశత్రువు వైనాండ్ అని, తను పోరాడాల్సింది వైనాండ్‌తోనేనని చెప్పి, Cameron కన్ను మూస్తాడు. తరువాత, కన్నెక్టికట్‌లోని ఒక గ్రానైటు క్వారీలో చిన్న ఉద్యోగం కోసం, మైక్ సాయం చేస్తాడు. అలా రోయార్క్‌కి కొత్త కొలువు దొరుకుతుంది.

ఇదే సమయానికి కీటింగ్ చాలా ధనవంతుడైపోతాడు. ఫ్రాంకన్‌ నుంచీ వెళ్ళిపోయే ముందు, రోయార్క్‌ కొన్ని డిజైన్సు చేస్తాడు. వాటినే వాడుకొని, తనకు తోచిన విధంగా అలంకరించి, వాటిని సొంత డిజైన్లుగా కీటింగ్ ప్రచారం చేసుకుంటాడు. ఆ డిజైన్లు విజయవంతమవ్వటంతో, కీటింగ్ ఫ్రాంకన్‌లోనే భాగస్తుడైపోతాడు. ఇదంతా పూర్వార్ధం.

ఓసారి డామినిక్, వేసవి సెలవలకై, కనెక్టికట్‌కి వస్తుంది . ఇక్కడే డామినిక్ మొదటసారి రోయార్క్‌ ను చూస్తుంది. ఇద్దరికీ ముఖపరిచయాలు ఏర్పడతాయి. ఐతే అతనెవరో, ఆమెకు తెలీదు. కనీసం పేరు కూడా తెలుసుకోదు. అతను కూడా, ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నమేమి చెయ్యడు. ఇంతలో Roger Enright అనే వ్యక్తి నుంచి కమిషను అందటంతో, రోయార్క్‌ తిరిగి న్యూయార్క్ చేరుకుంటాడు. అక్కడ, ఒక పార్టీలో డామినిక్‌కి మళ్ళీ పరిచయమవుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఒకలాంటి లవ్-హేట్ సంబంధం ఏర్పడుతుంది. చూసేవాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే అభిప్రాయం కలుగుతుంది

మెల్లగా రోయార్క్‌ ఆఫీసు పని పుంజుకుంటుంది. ఒకే సమయంలొ నాలుగైదు కమిషన్లు దొరికిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంతలో Hopton Stoddard (హాప్టన్ స్టాడర్డ్) అనే వ్యక్తి నిర్మించదల్చిన Stodard Temple కాంట్రాక్ట్ కూడా వస్తుంది. ఆ టెంపుల్‌కి అవసరమైన శిల్పం కోసం, తనలాంటి భావజాలమున్న శిల్పినే, రోయార్క్‌ పెట్టుకుంటాడు. ఆ శిల్పితో స్నేహం కూడా చివరిదాకా ఉంటుంది. ఈ శిల్పానికి మోడల్‌గా, డామినిక్‌ పనిజేస్తుంది. అమెరికన్ సమాజంలో షేరు మార్కెట్ ప్రభావం ఎంత వుందో కూడా, కధానుగుణంగా ఇక్కడ చర్చిస్తుంది రచయిత్రి. ఐతే ఈ టెంపుల్, సదరు Stodard గారికి నచ్చక, చెప్పినట్లు కట్టలేదని కోర్టులో కేసు వేస్తాడు. రోయార్క్‌ కేసు ఓడిపోవడంతో, మళ్ళా మొదటి స్థాయి కొచ్చేస్తాడు. కొన్ని విశదీకరించలేని సన్నివేశాలనంతరం, కీటింగ్‌ను డామినిక్ పెళ్ళి చేసుకుంటుంది. (ఆ జరిగిన సందర్భాన్ని, అందులోని ఆంతర్యాన్ని, ఎవరికి వారు చదువుకొని అర్థం చేసుకోవాలే కానీ, ఒకరు చెపితే అర్థమయ్యే విషయం కాదు కనుక, ఇక్కడ చెప్పటం లేదు).

ఇప్పుడు, కధలోకి పత్రికాధిపతి "వైనాండ్" ప్రవేశిస్తాడు. కీటింగుకి కమిషన్లు కాస్త తక్కువౌతాయి. టూయీ సహాయ సలహాలతో, డామనిక్ రూపంలో చేసిన స్టాడర్డ్ టెంపుల్లోని శిల్పాన్ని, వైనాండ్‌కి బహుమతిగా ఇచ్చి, ఒప్పించి, కీటింగు ఓ కాంట్రాక్టుని దక్కించుకుంటాడు. అలా డామినిక్‌‌కీ, వైనాండ్‌కి పరిచయం అవుతుంది. ఒప్పందం ప్రకారం, కీటింగు తన భార్య డామనిక్‌ను, వైనాండ్‌కు అప్పచెప్పేస్తాడు

Wynand yacht మీద, అతనితో డామినిక్ రెండు నెలలు క్రూజ్‌‌కి వెళ్తుంది. ఆ యాచ్ పేరు "I Do". పడవ ప్రయాణానికి ముందు, డామినిక్‌‌ని తిప్పుతూ, తన ఆర్ట్‌గాలరీనంతా చూపిస్తాడు. ఒక వారం కలిసి కబుర్లాడుతూ యాచ్ మీద గడిపాక, పెళ్ళి ప్రస్తావన తీసుకొస్తాడు. వైనాండ్‌ను పెళ్ళి చేసుకోవడానికి డామినిక్ ఒప్పుకుంటుంది. కీటింగ్‌కు విడాకులిచ్చి, ఓ 600 మంది ఆహతులు మధ్య వివాహం చేసుకుంటుంది. ఒక డైవర్సీని వైనాండ్ పెళ్ళి చేసుకున్నందుకు, మీడియా అంతా కోడై కూస్తుంది. డామినిక్ - వైనాండ్ల మధ్య మాటల్లో, ’ఇది కూడా మనసులేని కాపురమే’ అని డామినిక్ నిజాయితీగా ఒప్పుకుంటుంది. అంతే నిజాయితీతో వైనాండ్‌ స్పందిస్తాడు, "నేను నా ప్రేమ గురించి మాత్రమే అలోచించాను" అంటాడు.

ఇదిలా నడుస్తుండగా, రోయార్క్‌‍కు ఒక రెసార్ట్ వర్క్ దొరుకుతుంది. రెండేళ్ళు ఖాళీ లేకుండా పనిచేస్తాడు. ఐతే ఈ రెసార్ట్ గురుంచి ప్రచారం ఉండదు. కట్టించేవాళ్ళు, ఆ రిసార్ట్‌ని అధిక లాభాలకి అమ్మేసి, దివాళా తీసేసినట్టు చెప్పి, మోసంచేసే పనిలో ఉంటారు. ఆ వ్యూహంలో, ఓ పనికిమాలిన architectగా, వాళ్ళు రోయార్క్‌ను ఎంచుకుంటారు.

ఓసారి రోయార్క్‌ని కలవాలంటూ, వైనాండ్ ఓ పిలుపు పంపిస్తాడు. కలవగానే, కళ్ళతోనే ఇద్దరూ ఒకరినొకరు అంచనా వేసుకుంటారు. వైనాండ్ తన భార్య కోసం ఒక భవనాన్ని కట్టించాలని కోరుకుంటున్నట్టు చెబుతాడు. ఆ భవన నిర్మాణంలో రోయార్కు ప్రతిభ ప్రతిబించించాలని, తద్వారా రోయార్క్ ప్రతిభకీ, ప్రపంచానికీ మధ్యా మరే విధమైన అడ్డుగోడలూ ఉండకూడదని చెబుతాడు.

ఇద్దరూ భవంతి కట్టాల్సిన స్థలానికి, డ్రాయింగులతో వెళ్తారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. రోయార్క్‌ను వైనాండ్ ఇంటికి ఆహ్వానించి, భార్యను చూపిస్తాడు. తర్వాత తనే కొన్నిసార్లు స్వయంగా రోయార్క్‌ ఆఫీసుకు వెళతాడు. తన స్టాఫ్‌ను పిలిచి, రోయార్క్‌కు వ్యతిరేకంగా పత్రికలో ఏమీ రాయొద్దని చెబుతాడు. భవనంతో పాటూ, ఇలా ఇద్దరి పరిచయం పెరుగుతూ ఉంటుంది. నిర్మాణం పూర్తవుతుంది. డామినిక్ అందులో నివాసం మొదలుపెడ్తుంది. ఇంతలో, టూయీ వల్ల, వైనాండ్ పేపరు గురించి, జనంలో వ్యతిరేకత ప్రబలుతుంది. పీటర్ కీటింగ్ తన అవకాశవాదాన్ని మరలా బైటపెట్టుకుంటాడు. ఈసారి Catherine (టూయీ మేన కోడలు, అతని తొలి ప్రేయసి)ను ప్రపోజ్ చేస్తాడు. ఐతే ఆమె కూడా మెత్తని చెప్పుతో కొడుతుంది.

కధ నడుస్తూనే ఉంటుంది. ఓ పక్క పేపరులో గొడవలు పెంచేసి, అవకాశం కోసం ఎదురుచుస్తుంటాడు టూయీ. మరో పక్క, ఇదే టూయీ ద్వారా, కీటింగ్ ఓ ప్రాజెక్టు సంపాదించుకుంటాడు. Cartlandt హౌసింగ్ అనే ఆ ప్రభుత్వ ప్రాజెక్ట్ పనినంతా, రోయార్క్‌ చేసిపెడితే, కీటింగ్ తన పేరు పెట్టుకుంటాడు. రోయార్క్‌ కూడా, తానే రకంగా వేస్తాడో, అలాగే అది నిర్మింపబడాలన్న ఓ కండిషన్‌తో ఈ పని చేసిపెడతాడు. ఆ తరువాత వైనాండ్‌తో క్రూజ్‌పై వెళ్ళిపోతాడు. తిరిగొచ్చిన రోయార్క్‌, ఆ ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్ళి చూస్తే, కీటింగ్ నిస్సహాయత వల్ల అదంతా మార్పుచేర్పులకు గురైనట్లు తెలుసుకుంటాడు. డామినిక్ సహాయంతో, దాన్ని పేల్చేస్తాడు. పోలీసులు రోయార్క్‌ను అరెస్టు చేస్తారు. సమర్ధించబోయిన వైనాండ్‌పైన, టూయీ తిరుగుబాటు లేవదీసి లొంగదీస్తాడు.

బెయిలు పైన బయటకొచ్చిన వైనాండ్, రోయార్క్‌ వద్దకు వెళ్ళి, విషయం పత్రికలకెక్కేలా చేస్తాడు. "డామినక్‌కి విడాకులిస్తున్న వైనాండ్" అని ప్రచారం సాగిస్తాడు. దీనివల్ల, వైనాండ్ పేపర్ల సర్క్యులేషన్లు మళ్ళీ పెరుగుతాయి. ఆ పేల్చివేత కేసులో, జ్యూరీ ముందు రోయార్క్‌ తన వాదన వినిపిస్తాడు. ఆ వాదనలో "క్రియేటర్స్" గురించి, "సెకండ్ హాండర్స్" గురించీ, "Egoism" యొక్క అసలు అర్ధం ఏమిటో, అది ఎలా మంచిదో, స్వార్ధరాహిత్యం ఎలా హానికరమో వివరిస్తాడు. అతని వాదన విన్న జ్యూరీ మెబర్లంతా కలిసి, అతడు నిరపరాధి అని తీర్పునిస్తారు.

చివరికి :
డామినిక్‌కు వైనాండ్ విడాకులిస్తాడు.
Cartlandt projectని Enright సంపాదించి, రోయార్క్‌కే అప్పగిస్తాడు.
అప్పాయింట్మంట్ తీసుకొని రోయార్క్‌ దగ్గరకొచ్చి, వైనాండ్ సెక్రటరీ "వైనాండ్ బిల్డింగ్" కట్టేందుకు కాంట్రాక్ట్ ఇస్తుంది.

రోయార్క్‌ వ్యక్తిత్వం సంపూర్ణంగా అర్థం చేసుకున్న డామినిక్, తన లోపాల్ని సరిజేసుకొని, అతన్ని పెళ్ళాడుతుంది.
వైనాండ్ బిల్డింగ్ యొక్క నేము ప్లేటు మీద "Howard Roark, Architect" అన్న అక్షరాలని, సగర్వంగా చూసుకుంటుంది. అతని కోసం ఎలివేటర్లో పైకి వెళ్తూ కిందకి చూస్తే, కిందనున్నవన్నీ చిన్నచిన్నవిగా కనిపిస్తాయి. పైవైపు చూస్తే, ఆ ఒక్క కట్టడం రాజ సౌధంలా, ఠీవిగా, అంతెత్తుగా కనిపిస్తుంది.

ఇదీ కధ.

Monday, October 12, 2009

Why one does not want to become poor!?

Seriously, why don't anyone ever dream to become a "poor person" ?Its illogical qustion is it!? I am insane, is it!?
I can only say, it has to be with the way with our own notion of "logical thinking".
Can the Dominant Paradigm help me understand this? Is it just that it has been the dominant paradigm in the thinking that most people will only choose to become Rich but not the other way round!?
Can the long tail theories explain me this!?
Can there be a small portion of the society which actually want to become poor - however statiscally insignificant may be that number !?
Can there be people who think "it's cool to be poor "
Can it be made fashionable!!??
After all, there ARE concepts too.......like renunciation, and the life in Vaanaprastham in some culture.rt!?

Thursday, October 8, 2009

What Is Intelligence, Anyway?

What Is Intelligence, Anyway?
By Isaac Asimov
What is intelligence, anyway?
When I was in the army, I received the kind of aptitude test that all soldiers took and, against a normal of 100, scored 160. No one at the base had ever seen a figure like that, and for two hours they made a big fuss over me. (It didn’t mean anything. The next day I was still a buck private with KP – kitchen police – as my highest duty.)
All my life I’ve been registering scores like that, so that I have the complacent feeling that I’m highly intelligent, and I expect other people to think so too.
Actually, though, don’t such scores simply mean that I am very good at answering the type of academic questions that are considered worthy of answers by people who make up the intelligence tests – people with intellectual bents similar to mine?
For instance, I had an auto-repair man once, who, on these intelligence tests, could not possibly have scored more than 80, by my estimate. I always took it for granted that I was far more intelligent than he was.
Yet, when anything went wrong with my car I hastened to him with it, watched him anxiously as he explored its vitals, and listened to his pronouncements as though they were divine oracles – and he always fixed my car.
Well, then, suppose my auto-repair man devised questions for an intelligence test.
Or suppose a carpenter did, or a farmer, or, indeed, almost anyone but an academician. By every one of those tests, I’d prove myself a moron, and I’d be a moron, too.
In a world where I could not use my academic training and my verbal talents but had to do something intricate or hard, working with my hands, I would do poorly.
My intelligence, then, is not absolute but is a function of the society I live in and of the fact that a small subsection of that society has managed to foist itself on the rest as an arbiter of such matters.
Consider my auto-repair man, again.
He had a habit of telling me jokes whenever he saw me.
One time he raised his head from under the automobile hood to say: “Doc, a deaf-and-mute guy went into a hardware store to ask for some nails. He put two fingers together on the counter and made hammering motions with the other hand.
The clerk brought him a hammer. He shook his head and pointed to the two fingers he was hammering. The clerk brought him nails. He picked out the sizes he wanted, and left. Well, doc, the next guy who came in was a blind man. He wanted scissors.
How do you suppose he asked for them?”
Indulgently, I lifted by right hand and made scissoring motions with my first two fingers.
Whereupon my auto-repair man laughed raucously and said, “Why, you dumb jerk, he used his voice and asked for them..”
Then he said smugly, “I’ve been trying that on all my customers today.” “Did you catch many?” I asked. “Quite a few,” he said, “but I knew for sure I’d catch you.”
“Why is that?” I asked. “Because you’re so god damned educated, doc, I knew you couldn’t be very smart.”
And I have an uneasy feeling he had something there.
________________________________________________
I just happend to stumble on this and just wanted to keep it here...Just like that...

Wednesday, October 7, 2009

రాజాధిరాజ! రాజశేఖరా! రక్షించు!

అబ్రకదబ్ర ఆలోచనతో అంగీకరిస్తూ, కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి పేరును పెట్టడాన్ని నిరసిస్తూ, ఈ పోస్టు రాస్తున్నాను.
ఈ పేరు మార్పిడిని ఎందుకు నిరసిస్తున్నాను!? :
౧. అబ్రకదబ్ర పోస్టులో చెప్పినట్టుగానే, "కడప" అన్న పేరుకీ ఓ సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది గాబట్టీ; ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా ఏదన్నా ప్రాధాన్యతని ఆపాదించి, దాన్ని "రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకులు పుట్టిన గడ్డ ఇది" అని చెప్పుకోవడానికైతే అభ్యంతరం ఎవ్వరికీ ఉండదు గాబట్టి. ఇలా అన్ని జిల్లాల పేర్లూ మార్చుకుంటూ పోవటం ఏం బాగోలేదు గాబట్టి.

౨. అసలు, రాజశేకరుడు ఇంత పాపులారిటీలోకి వచ్చిందీ తన హయాంలోనే తెస్తానని జనాలకి ప్రమాణం చేసిన ప్రాజెక్టుల ఐడియాతో గాబట్టి, ఆయా ప్రాజెక్టుల్లో ప్రతి దానికి ఈయాన పేరు జోడించటం ఇంతకంటే చాలా చాలా బావుంటుంది.

౩. ఇక నుంచీ ప్రజలకి ఉపయోగార్ధం కట్టబడే కట్టడాలకీ , రోడ్లకీ మొ ఆయన పేరు పెట్టుకోవచ్చు. "రాజశేఖర్ రహదారి" అంటూ రాష్ట్ర రహదారులకు (కొత్తవి కట్టి :) ) పేర్లూ పెట్టుకోవచ్చూ!

ఇలా ఎన్నో ఇతర అవకాశలతో నాయకుడిపై ప్రేమను, అభిమానాన్ని చూపుకునే అవకాశాలుండగా, చచ్చిన ప్రతినాయకుడి పేరుకోసం ఆల్రెడీ ఉన్న వాటికే పేరు మార్చడం అన్నది చాలా ఛండాలంగా ఉంది.

అలాగే కరీంనగర్ పేరు మార్చడం గురించి కూడా కొందరు అనవసర చర్చలు చేసారు. అది కూడా వేస్టు. శుద్ద దండగ. ఆ జిల్లా పేరు కరీంనగర్ గానే ఉండనియ్యండి. పివి నరసింహారావుగారు పేరుని మన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడదాం అన్నప్పుడు, అది పడనివ్వ లేదు. తెలుగుదేశంవారే, మరో కాంగ్రేసు వాడి పేరు ఆలోచించినా, కాంగ్రేసు వాళ్ళు ఒప్పుకోకపోవటం - అధిష్టానంపై విధేయత ప్రకటించడం - లాంటి రాజకీయ కారణాల వల్ల జరిగింది. అలాంటి రాజకీయ కారణాలను నేను చర్చించను.

ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అసలు గొప్ప నాయకుడా లేక క్రిమినల్లా అంటూ అస్సలే చర్చించను. ఆయన గొప్ప నాయకుడే ననుకొని, ఆయన పేరు దేనికన్నా పెడదాం అనుకున్నా - ఇలా జిల్లాల పేర్లు మార్చడం కాకుండా, ఏదేని ప్రాజెక్టుని యుద్ద ప్రాతిపదికన ముగించి, దానికే ఆయన పేరు పెట్టి జాతికి అంకింతం ఇవ్వడం అనేది మరింత సంమంజంసంగానూ, ముదావహంగానూ ఉంటుందని విన్నవించుకుంటున్నాను. కడప జిల్లా పేరు మార్చ వద్దని అర్ధిస్తున్నాను.

ప్రాజెక్టులు అవ్వవేమో అని అనుమానమున్నా - ఏదో ఓ మంచి పనిగా చేసిన నిర్మాణం ఈ సరికి తయారవుతూ ఉండి ఉండే ఉంటుంది - దానికి ఆయన పేరు పెట్టండీ అని అభ్యర్ధిస్తున్నాను. అది అంత ఘనంగా లేదని అసంతృప్తిగా ఉంటే, ఏదేనీ ఘనమైన ప్రాజెక్టుని తలపెట్టి, సంవత్సరంలోగా ముగించి, ఆయన డెత్ యానివర్సరీ కల్లా, ఆయన పేరుతో జాతికి అంకింతం ఇచ్చి, ఆయన గొప్పదనాన్ని ఇనుమడించేలా చెయ్యమనీ మనవి.

ఈ విన్నపానికి రాజాధిరాజు! రాజశేఖరు! ని ఆమోదం కలగాలని ప్రార్ధిస్తున్నాను.

వితండ వాదం

(క్షుణ్ణంగా విషయ పరిగ్నానంతో సోదాహరణాస్త్రాలతో వుద్దండ పండితులు...…
...........నావితండవాదం అస్త్రంతో నేను )
యిలా ఎందుకు అయ్యుండ కూడదు?
అసలు ఈ అంశం పై చర్చించాలంటే నాకు కొన్ని సంశయాలు ఎవరైనా నివ్రుత్తిచేస్తే బాగుంటుంది. అవేమిటంటే:
మహాభారత కధ, కాలమాన పరిస్తితులు, పాత్రలు, పాత్ర విధి నిర్వహణలు, వాటివాటి వ్యక్తిత్వాలు లాటివాటిని రచించిన వ్యాస మహర్షి ఘనత పైన చర్చించాలా?
(లేక) మహాభారతం నిజ చరిత్రా? రచనా వైదుష్యమా? - అన్న విషయం పై చర్చించాలా?
(లేక) మహాభారత సమయం మన యీ మానవ సమాజం నాటిదా లేక యింకా ముందుదా అని చర్చ చేయాలా?
(లేక) మహాభారత కధ నుండి …ఆధ్యాత్మిక,.రాజకీయ, ఆర్ధిక, సాంఘిక,సాంకేతిక,విషయాలపైనా?
(లేక) విద్య,మానవ సంబంధాలు,వుత్పత్తి,సేకరణ, రవాణా,పంపిణీ,,భూ,జల మార్గ సదుపాయాలూ,సాధనాలు,పశుపక్ష్యాదులూ,వాటితో మానవ బంధనలూ,వ్రుక్ష సంపద,వినియోగం_ సంరక్షణ, జలవనరులు, పారుదల వ్యవస్త వంటి సామాజిక జీవన వనరుల గురించి చర్చించాలా?
(లేక) అప్పటి సాంకేతిక పరిగ్నానం,నైపుణ్యం,మానవ వనరుల వినియోగం, సాంకేతిక విద్య వంటి విషయాలపై చర్చించాలా?
(లేక) మహా భారత కధాంశాలూ, నేటి మానవ సమాజావసరాలకు, సంక్షేమానికి వాటి వుపయోగాలు వంటి విషయాలు చర్చించాలా?
(లేక) తెలుగులో వ్రాయబడిన మహాభారత కధలో సాహిత్యపు లో లోతులను విశ్లేశించాలా?
క్షమించండి, అర్ధ గ్నానులకు ఇన్ని సందేహాలుండటం లో అగ్నానం యేమీ లేదని నా భావన. ఇక పోతే పైన పేర్కొన్న వాటినుండి యేదో అంశం తీసుకొని నాదైన శైలిలో, నా ద్రుఃక్కోణంలో వ్రాసి మీ ముందుంచటానికి నా పరిమిత గ్నానంలో నా ప్రయత్నం కొనసాగిస్తా.
———————————————————————————
మహాభారతం….మరో ద్రుఃక్కోణం .లో….విశ్లేషించడం….. సాహితీ క్రుషీవలులకు,ఆ మహథ్గ్రంధాన్ని పుక్కిట బట్టిన నిష్ణాతులైన స్కాలర్స్ కు దక్క - అతి సామాన్యులైన నా బోంట్లకు వూహించ రాని విషయం.
యేదో విన్నాం.ఇంకేదో చదివాం, మరింకేదో చూశాం. అవన్నీ వినిపించిన, చదివి చెప్పిన, చిత్రాలుగా,నాటకాలుగా ప్రదర్శించిన వారి వారి ద్రుఃక్పధాన్ని బట్టి వుంటుంది. కానీ యిదే మహా భారత కధను ఎవరికి వారు వారి వారి రీతుల్లో విశ్లేషించవచ్చు, అన్వయించవచ్చు.
యీ భువి పైన శబ్దం నుండి సంగ్న పుట్టి, పదం పుట్టి, భాష పుట్టి, లిపి పుట్టి, వ్రాత పుట్టి ఎన్ని యేళ్ళయినా - వ్రాత విస్త్రుతంగా వాడుకలోకి వచ్చింది మాత్రం, లోహాలు విస్త్రుతంగా వాడుకలోకి వచ్చిన తరువాతే. తామ్ర పత్రాలద్వారా, అంతకు ముందు శిలా శాసనాల ద్వారా, దారు శాసనాల ద్వారా వ్రాతను విస్త్రుత పరిచారు. ఆ తరువాత, వృక్ష సంపద భువిపై వుధ్భవించిన తర్వాతే తాళ పత్ర గ్రంధాలద్వారా కవులు తమ సాహితీ సామర్ధ్యాన్ని వెలుగులోకి తెచ్చారు.
యింతకూ నేను చెప్పాలనుకున్న దేమంటే…వ్యాస మహాముని అని చెప్ప బడే ఆ మహా కవి మహాభారత కావ్యానికి ఎన్నుకున్న సమయం…. లిపి పుట్టి ,భాషలు వాడుకలోకి వచ్చిన తరువాత.
అదీకాక,
పశువులను మానవులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తరువాత జరిగిన కధ.
తాటి చెట్లు, మర్రిచెట్లు పుట్టిన తరువాత జరిగిన కథ.
లోహాన్ని, మందుగుండు సామాగ్రిని కనిపెట్టి వాడుకలోనికి తెచ్చిన తరువాత వ్రాసిన కథ.
సమాజంలో నాగరికత ప్రబలిన నాటి కథ.
అధికార కాంక్ష ,వారసత్వ రాజకీయం విస్త్రుతంగా ప్రబలి వున్న కాలం నాటి కథ.
సాంకేతిక నైపుణ్యం విస్త్రుతమౌతున్న నాటి కథ.
యుధ్ధ నైపుణ్యం, అస్త్ర శస్త్ర వినియోగం, వాటి కొరకు లోహ వినియోగం అధికమౌతున్న నాటి కథ.
కుల మౌఢ్యం దారుణంగా వున్న నాటి కథ.
జంతుసామ్య వ్యవస్త నుండి సామాజిక వ్యవస్తగా రూపంతరం చెందిన నాటి కథ.
యింకా చెప్పాలంటే మహాభారతమ్ ఆర్యుల కాలం నాటి కథ. ఆర్యులు భారత దేశాన్ని అన్యాక్రాంతం చేసుకొని గోవులను పెంచడం ప్రారంభించిన నాటి కథ.
క్లుప్తంగా చెప్పాలంటే క్రీస్తుని క్రిష్ట్నునిగా స్తానికీకరణ చేసి క్రిష్ట్ణున్నినల్లగా చూపి,చలాకీగా చూపి స్తానికీకరణ చేసినప్పటి కథ.
విదేశీ గోవుల పాలనే జీవన మార్గమైన నాటి కథ. ఆవులే ఆస్తులైన ఆర్యులు వ్రాయించిన కథ.
యివన్నీ కథలే. ఆయా కాలాల స్తానిక ,సామాజిక, రాజకీయ స్తితి గతుల నేపధ్యంతో స్రుష్టింప బడిన కధనాలే. కానీ….కవిత్వం, భాష ,కధా, కధనం పాత్రల చిత్రణ, నేపధ్య వర్ణణ, ఆనాటి వివిధరంగాల వ్యవహార శైలి, సామాజిక నైతిక వర్తనా నియమాలూ, రాజకీయ చిత్రణ, వాస్తు, కళా వర్ణన - అమోఘం! న భూతో న భవిష్యతి!
మహాధ్భుత కధనంతో ఆ నాటి సమాజ జీవన వివరణతో, అన్ని రంగాల వారికీ, వయసుతో నిమిత్తం లేని ఒక మహత్తరమైన ఎడ్యుకేషనల్ సిలబస్.( a greatest educational sylabus for every activist. even for this movement.) ఒక మహోత్క్రుష్ట గ్రంధ రాజం ….మహాభారతం.
ముగింపుమాట:
భారతం…. నాగరికత పెరిగిన తరువాత, సమాజంలో ’నాది’, ’నీది’, ’నా భార్య’, ’నా పిల్లలు’ అనే సంకుచిత భావనలకు అంకురం పడిన తరువాత, స్వార్ధ భావనలు పెరిగిన తరువాత, అన్ని రంగాలలోనూ పరిశొధనలు జరిగి ఆయా రంగాలు సమ్రుద్ధి చెందిన తరువాత, లోహ వినియోగం, జంతు మాలిమి జరిగి వాటి వుపయోగం పెరిగిన తరువాత …ఆ సమాజపు రూపు రేఖలు, విధి విధానాల, కర్తవ్య్యాల వివరణే మహాభారత కధ.
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.