Tuesday, November 10, 2009

రాండీ(ధీ) కథలో రంజు తగ్గింది

రాండీ ఈ కధలో తక్కువైన విషయాలు కొన్ని :

౧.అతను ఓ అతి సామాన్యమైన మనిషి. కొడితే తిరిగి కొట్టే సీను లేదు. ఒకసారి చావ చితకొట్టారు కూడా! కానీ గమ్మత్తు ! ఆ తరువాత ఎవ్వరూ అతని మీద చెయ్యి వెయ్యలేదు!!అతనే రాండీ!!!
౨.రాండీకి సిగరెట్టు తాగటం భలే ఇష్టం! కానీ, వాళ్ళయ్యకి అదిష్టం లేదు. కాకపోతే వాళ్ళయ్యంటే రాండీకి చానా ఇష్టం. తాగలేదని అబద్ధం చెప్పానని ఉత్తరం రాసి మరీ చెప్పాడు. వాళ్ళయ్య కొడతాడనే అనుకున్నాడు.........కానీ అదేంటో వాళ్ళయ్య కొట్టలేదు.

౩.రాండీకి ఒకటే సెక్సు యావ! రేతిరేళ వాళ్ళయ్య కాళ్ళు పిసకరా అంటే, కాళ్లు పట్టినంత సేపూ ఎప్పుడెప్పుడు ఎనక్కదిలో పెళ్ళాం దగ్గరకెళ్ళి పిసుక్కుందామా అనే తెగి ఇదైపోయేవాడు. ఓ రోజు అలాగే చాలా ఇదైపోయి, కొంచెం తొందరగా గదిలో కెళితే, నా యాల్ది .....సరిగ్గా పన్లోకి దిగంగానే బయట ఏడ్పులు ఇనిపించినాయి. బయటికొచ్చి
చూసేసరికి, అయ్య శవమై పడుండాడు. ’దానమ్మ జీవితం .... రోజు కూర్సునేటోడిని, ఇయ్యాలే ఎగేసిన! ఈడు ఇయ్యాలే దొబ్బేయ్యాలే’ అనిపించింది రాండీకి. అప్పట్నించీ సెక్సు యావ మీద రాండీకి యావగింపు మొదలయ్యింది.

౪.వీడు ఇంటికాడుంటే బాగుపడడని, రాండీ అన్నయ్యకి అర్ధమయిపోయింది. చానా కష్టపడి ఇంగ్లాడు పంపించేశాడు. ఇయ్యాల అమెరికా బోయి కంప్యూటరు చదివితే బాగుపడుతారని పొలాలు కుదవబెట్టి పంపుండ్లా, అట్లానే అప్పుట్లో ప్రతి నాకొడుకు ఎగేసుకుంటూ లండన్ పోయేటోడు! లా సదువుకోనికి. ఇప్పుడు పెపంచం అంతా కంప్యూటరే చదువైనట్టు, అదే రాజ్యమేలినట్టు, అప్పుట్లో రవి అస్తమించన ఇంగ్లీషోడి రాజ్యంలో "లా" అని ఒక చదువుండేది. అదేటో మామూలు జనాలికి ఏటర్దమౌతాది సెప్పు. అందుకని, దానికి సడన్గా డిమాండొచ్చేసినాది. లండన్ ఎళ్ళాడు కానీ, ఏం సేద్దాం సెప్పు. ఈ రాండీ నాకొడుక్కి తిక్కెక్కువ గందా! అందుకని ఇంగ్లీషుడితో సెట్టింగవ్వలేదు.అక్కడే మొదలైంది అసలు సమస్య.

౫. పోన్లేగందా, ఏదో ఓటి సేసేసి ఇంటికి పోదాం అనుకునేటోడు. నా కొడుకులు ఊరికుంటిరా! రా రా క్రైస్తవంలోకి రా రా అని సావకొట్టేసినారు. సెప్పినాను గందా! రాండీకి తిక్కెక్కువ! ఎవ్వడూ సెప్పినా ఇనడు. సిన్నప్పడ్నించీ వాడంతే! ఇదిగో అప్పుడే వాడు తెగ సదివేసినాడు. రమ్మనేటేడు ప్రతోడు ఓ పుస్తకం ఫ్రీగా ఇచ్చేటోడు గంద! రాండీకి క్రైస్తవం బాగా అర్ధమయ్యింది. అది తరువాత కాలంలో బాగా ఉపయోగపడుతుందని, అప్పటికి అతనికి తెలీదు.

౬.పన్లోపనిగా మరి రామాయణమూ, భారతమూ కూడా సదవకపోతే ఎట్టా అని అవి కూడా సదివేసినాడు. అప్పుడే అర్ధమయ్యింది. తను కూడా అవి రాసేయ్యచ్చని.ఆ కోరికని అతను తీర్చుకోగలడని కూడా ఆ రోజుకు అతనికి తెలీదు.

౭.అప్పట్లో మజ్జిలో సెక్సు చేసుకోవటానికి ఓ గొప్ప అవకాశం వచ్చింది. బ్రోతల్‌ హౌస్‌కి తీసుకెళ్ళాడు ఓ స్నేహితుడు. కానీ అదేటో, రాండీ ఆ రండీతో సెయ్యాలనుందో లేదో తేల్చుకోలేక పొయ్యాడు. గదిలోకైతే ఎళ్ళాడు గానీ, సెయ్యలేక పోయాడు. కాసేపు కూర్సొని వచ్చేసినాడు. ఆ ఆడది బహుశా "శాతకాని సెచ్చినోడు. టైం వేస్టు సేసినాడు" అనుకుందేమో! అప్పటికి, ’మంచి విటులు-బ్రోతల్ హౌసులో అమ్మాయిలని ప్రేమించి ఎత్తుకొచ్చి పెళ్ళిచేసుకొనే’ సినిమాలకి ఇంకా పాపులారిటీ లేదు.

౮. అలా ఉంటూ ఉండగా, అప్పుడు సెక్సు సేసుకునేందుకు మరో మహదావకాశంగా - కాండోమ్స్ వచ్చేయి. కిరస్తానీలో వాటిని బ్యాన్ చేశారు. అయ్యి వాడి సేసుకుందామా వద్దా అని రాంధీ గాడు తెగ ఇదయ్యి పోయినాడు. కానీ, బెమ్మచరియం పాటిస్తే బెటర్ అనుకొని పెళ్ళాంతో సెప్పినాడు. ఈడితో ఏగలేకపోతున్నాం అనుకుందో ఏమో, సరే అట్టానే కానిమ్మంది పెళ్ళాం.

౯. రాండీకి ఒరిజినల్ ఐడియాస్ తక్కువే!కానీ ఏదైనా నచ్చిన వాటిని తనకు అణుగుణంగా మార్చుకునేటోడు. ఇక ఆ సంది ఎవ్వడేమన్నా వినే ప్రసక్తే లేదు.పోనీ అలా అని దానంతు చూశాడా అంటే అదీ లేదు. అచ్చు రామ్ గోపాల్ వర్మలాగానే, రోజుకో ఐడియా మనోడికి. అన్నీ సగంలో వదిలేసి, ఐడియా ఇంకోడికిచ్చి ఎళ్ళిపోయేటేడు.అదేటో! అదృష్టంగానీ! దీనివల్ల బోళ్డెన్ని కాంటెక్టులొచ్చాసాయి వీడికి.

౧౦.తిలకం సచ్చిపోనాడు. రాంధీకి బాదేసింది. కానీ ఇందులోంచి ఓ అవకాశమూ, ఐడియా వచ్చేసినాది. ఆ తర్వాత ఎప్పుడుకో గానీ, ఇంగ్లీషు వాడిని తరిమి కొట్టాలనే ఐడియా రాలేదు. కానీ, ఇంగ్లీషోడి **కాయలు పిసికేసే ఐడియాలు మాత్రం చేసేవాడు. బంద్, హర్తాళ్!!! ఇంగ్లీషోడి రక్తప్రసారం ఆగి పోయేది. గిల గిల తన్నుకు చచ్చేటోళ్లు. ఇంగ్లిషోడు వచ్చింది డబ్బుకోసంగానీ, నా యాల్ది ఈ దేశం వాడి కింద ఉంటేనేంటీ లేకపోతే నేంటీ - అనే విషయం పిచ్చ క్లియర్‌గా అర్ధం అయింది రాండీకి. అందుకే, ఎప్పుడూ వాళ్ళ డబ్బు మీద దెబ్బ కొట్టేవాడు. ’పోనీ ఈడ్ని సంపేస్తే ఓ గొడవొదలిపోద్ది’ అన్న ఐడియా వాళ్ళకీ వచ్చింది!! అరే! జలియన్‌వాలాబాగ్‌లో అంతమందిని సంపినోళ్ళు ఒక్క రాండీని ఏసేస్తే గొడవైపోయేది గందా!! సివరికి, బాసుగాడే సచ్చేడో, బాసుగాడ్ని ఈళ్ళే సంపేరు కూడా తెలీదు గందా. మరి రాండీగాడిని
ఇంగ్లీషోడు సంపలేదు. ఎందుకూ?? దానికి కారణం ఉంది. రాండీకి క్రైస్తవం బాగా అర్ధమయ్యింది. రామాయణ మహా భారాతాలు ఇంకా బాగా అర్ధమయ్యాయి.

శ్రీ కిట్టుడు ముసలంతోనే సస్తాడని తెలుసు. కానీ, దానికి ముందు కురుక్షేత్రంలో పాండవులకు విజయం ఇచ్చే సస్తాడు మరి!!
ఈ విసయం తెలీని కొంతమంది పిచ్చినా కొడుకులు, ’హే రామ్!’ అంటేగానీ ఈడు దేవుడి దగ్గరికి పోడు’ అనుకొనేసి, రాండీగాడు సచ్చేముందు హేరామ్ అన్నాడో అంటూ ప్రచారం సేసినారు!రాండీగాడు అలా అనకపోయిన పర్లేదనే విషయం, రాండీగాడి తెలివి తెలిసినోడికే తెలుస్తాది మరి!
ఎదేమైనా, రాండీగాడి కథని కథలు కథలుగా సెప్పుకుంటున్నారు జనం!